logo

నేషనల్ ఎలిజిబిలటీ టెస్ట్ (నెట్) దరఖాస్తు చేసుకోండి -మైనారిటీ జిల్లా అధ్యక్షుడు ఎండీ యాకూబ్ పాషా

తెలంగాణ స్టేట్:: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా:: (ఏప్రిల్ 28)

*కొత్తగూడెం* : యూనివర్సిటీ లో జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్ట్ లకు మరియు పీహెచ్. డీ లలో ప్రవేశాల కొరకు యూనివర్సిటీ గ్రాండ్స్ కమిషన్ నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నెట్-2024)కు దరఖాస్తు చేసుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మైనార్టీ అధ్యక్షులు ఎండీ. యాకూబ్ పాషా ఆదివారం నాడు ఒక ప్రకటనలో కోరారు. అరబ్ కల్చర్ అండ్ ఇస్లామిక్ స్టడీస్ , అరబిక్, కామర్స్, ఇంగ్లీష్, ఎకనామిక్స్, జియోగ్రఫీ, సైకాలజీ, కంప్యూటర్ సైన్స్, లా వంటి తదితర సబ్జెక్ట్ లలో పరీక్ష నిర్వహించ బడుతుందని, మాస్టర్స్ డిగ్రీ లేదా తత్సమాన పరీక్షలో 55% మార్కులతో ఉత్తీర్ణులైన వారు, ఓబీసీ, యస్.సీ, యస్. టీ, దివ్యాంగులు , థర్డ్ జెండర్ కేటగిరీ వారు 50% మార్కులు పొందిన వారు ఈ " నెట్ " పరీక్ష రాయడానికి అర్హులని పేర్కొన్నారు. అర్హతలు, ఆసక్తి కలిగిన అభ్యర్ధులు మే 10 తేదీ లోపు తమ వివరాలను https://ugcnet.nta.ac.in/ అనే వెబ్‌సైట్ నందు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

46
3276 views